Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వర్షంలో ఆడుకుంటున్నారా..? అయితే జాగ్రత్త
posted on: Jul 6, 2019 2:59PM
.jpg)
వర్షాకాలం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి..బయట వర్షం పడుతుంటూ సరదాగా చిరు జల్లుల్లో తడిసిపోతాం.. ఇంట్లోకి వచ్చి అమ్మ చేతి వేడి వేడి పకోడీలో.. భజ్జీలో తినడం అబ్బా ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం.. అయితే వర్షంలో తడవటం ఆ క్షణం వరకు బాగున్నా.. తడిసిన తర్వాత మన శరీరాలతో ఆడుకోవటానికి వైరస్‌లు కాచుకుని కూర్చుంటాయి. ఈ కాలంలో బ్యాక్టీరియా, ఫంగస్, ఈస్ట్‌లు ఇన్‌ఫెక్షన్లను కలగజేస్తాయి.. అందుకే వర్షాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు.
అవేంటో ఒకసారి చూద్దాం:
* చర్మాన్ని వీలైనంత పొడిగా ఉంచుకోవాలి.
* చేతులు, కాలి వేళ్ల మధ్య తడిని ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ..యాంటీ ఫంగల్ పౌడర్ చల్లుకోవాలి.
* పాదాలకు ఎక్కువ చెమట పట్టే శరీరతత్వం ఉన్నవాళ్లు ఈ కాలంలో షూస్‌కి బదులు గాలి ఆడే చెప్పులు ధరించడం మంచిది.
* నీటిలో ఎక్కువగా పనిచేసే వాళ్లు, గృహిణులు, రైతులు, కూలీలు పాదాలకు, చేతులకు గ్లౌజులు వేసుకోవాలి.
* షుగర్ ఉన్నవాళ్లు దానిని అదుపులో ఉంచుకోవాలి..ఎందుకంటే వర్షాకాలంలో షుగర్ పేషేంట్ల పాదాలకు ఇన్ఫెక్షన్లు చాలా సులభంగా సొకుతాయి.
* వానలో తప్పనిసరై బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగులు, రెయిన్‌కోట్లు వేసుకోవడం మంచిది.
* పొడిగా ఉంటే బట్టలను ధరించాలి.


.jpg)



