Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రూ. 59.70 కోట్లతో పిఠాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం
posted on: Mar 26, 2025 9:40AM
.webp)
పిఠాపురంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఈ బ్రిడ్జి నిర్మాణానికి మార్గం సుగమమైంది. కేందర రోడ్డు, మౌలిక సదుపాయాల నిధి (ఆఆర్ఐఎఫ్) పథకం కింద సామర్లకోట- ఉప్పాడ రోడ్డులో ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం లభించింది. ఇందు కోసం 59 కోట్ల 70 లక్షల రూపాయలు కేటాయించారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
గత ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే పిఠాపురంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చనున్నారు. ఇందు కోసం మంగళవారం (మార్చి 25) పరిపాలనా అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది.
ఈ బ్రిడ్జి నిర్మాణ వ్యయాన్ని తొలుత రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఆ తరువాత ఈ వ్యయాన్ని సీఆర్ఐఎఫ్ కింద కేంద్ర ప్రభుత్వం రియింబర్స్ చేస్తుంది. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు కావడం పట్ల పిఠాపురం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన వాగ్దానాన్ని పవన్ కల్యాణ్ నెరవేర్చుకుంటున్నారని ప్రశంసలు గుప్పిస్తున్నారు.


.webp)



