TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రైల్వే ఉద్యోగి అనుమానాస్పద మృతి

Published on: Sat Mar 28, 2015 11:15AM

 

కుప్పం మండలం మల్లనూరు రైల్వేస్టేషన్ వద్ద శనివారం సుందరప్ప అనే ఒక రైల్వే ఉద్యోగి మృతదేహాన్ని గుర్తించారు. బెంగుళూరు-చెన్నై రైలు మార్గంలో మల్లనూరు రైల్వేస్టేషన్ వద్ద స్థానికులు మృతదేహాన్ని గుర్తించినట్టు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సుందరప్ప మల్లనూరు గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి. ఇతను కుప్పం రైల్వే స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే శుక్రవారం ఉదయం ఇంటి నుండి వెళ్లిన సుందరప్ప రాత్రి ఎంతసేపటికి ఇల్లు చేరుకోలేదు. దీంతో కుటుంబసభ్యులు పోలీస్ కంప్లైట్ ఇచ్చారు. ఇదిలా ఉండగా సుందరప్ప మృతదేహాన్ని శనివారం ఉదయం గ్రామస్థులు రైలు పట్టాలపై ఉండటం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.