పెరిగిన రైలు టికెట్ ధరలు
posted on Apr 1, 2013 11:59AM

రైల్వే బడ్జెట్ లో పెంచిన టికెట్ ధరలు, ఇతర ఛార్జీలు ఏప్రిల్ నుంచి అమలు కానున్నాయి. బడ్జెట్ లో ప్రకటించిన దాని ప్రకారం సెకండ్, స్లీపర్ క్లాస్ చార్జీలు పెరగకపోయినా.. ఏసీ రిజర్వేషన్ చార్జి టికెట్‌కు రూ.15 నుంచి రూ.25కు, సూపర్ ఫాస్ట్ రైళ్లలో సెకండ్, స్లీపర్ క్లాస్ టికెట్లకు రూ.10 పెరగనుంది. అలాగే, తత్కాల్ చార్జీలు కూడా సెకండ్ క్లాస్ టికెట్‌పై పది శాతం, ఏసీ టికెట్‌పై 30 శాతం పెరగనున్నాయి.
రిజర్వేషన్ ఖాయమైన టికెట్‌ను రద్దు చేసుకుంటే ఇకనుంచి రూ.50 హాంఫట్! వెయిటింగ్ లిస్ట్, ఆర్ఏసీ టికెట్లను రద్దు చేసుకుంటే టికెట్‌కు రూ.5; ఏసీ టికెట్‌కు రూ.10 చొప్పున చార్జీలు పెరిగాయి. ఇకనుంచి, రైలు ప్రయాణానికి పక్కా ప్రణాళిక ఎంత అవసరమో.. ఆచితూచి ప్రయాణాలు పెట్టుకోవడమూ అంతే అవసరం.