రైల్వే బడ్జెట్‌ 2013-14 హైలైట్స్

 

 

 

దేశాన్ని ఏకం చేయడంలో రైల్వేలదే కీలక పాత్రని, దేశాభివృద్ధిలో భారతీయ రైల్వే పాత్ర గణనీయమైందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పవన్ కుమార్ బన్సాల్ పేర్కొన్నారు. రూ. 5.19 లక్షల కోట్లతో 2013-14 రైల్వే బడ్జెట్‌ను మంగళవారం మధ్యాహ్నం బన్సాల్ లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రజల ఆకాంక్షను బడ్జెట్ ప్రతిబింభిస్తుందన్నారు. కొత్త ప్రాజెక్టులు, రైళ్ల డిమాండ్లు ఎన్నో ఉన్నాయని బన్సాల్ తెలిపారు.

రైల్వే బడ్జెట్‌లో ముఖ్యాంశాలు :

* విజయవాడ సహా ఆరు చోట్ల మంచినీటి ప్లాంట్లు.
* విశాఖలో పర్యాటకుల కోసం లగ్జరీ లాంజ్.
* సికింద్రాబాద్‌లో ఎక్సిక్లూజివ్ సెంట్రలైజ్డ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్.
* కర్నూలులో రైల్వే వర్క్ షాప్.
* కాజీపేట సహా 25 ప్రదేశాల్లో శిక్షణా కేంద్రాలు.
* కాలం చెల్లిన 17 రైల్వే బ్రిడ్జ్‌ల స్థానంలో ఈ ఏడాది కొత్తగా వంతెనలు నిర్మిస్తాం.
* మహిళా ప్రయాణికుల భద్రత కోసం మరో ఎనిమిది కంపెనీల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్.
* మెట్రో నగరాల లోకల్ రైళ్లలో మహిళా బోగీల్లో మహిళా పోలీసులు.
* ఆర్‌పీఎఫ్‌లో ఇకపై 10 శాతం మహిళలు.
* ఎంపిక చేసిన రైళ్లలో అత్యంత విశాలవంతమైన కోచ్‌లు.
* ప్రధాన రైళ్లలో ఉచిత వైఫై సౌకర్యం.
* టికెట్ బుకింగ్ ఆధార్‌తో అనుసంధానం
* వికలాంగులు, వృద్ధుల కోసం 179 ఎక్స్‌లేటర్లు, 400 లిఫ్టులు.
* రైల్వే స్టేటస్‌ను చెప్పే ఎస్ఎమ్ఎస్ వ్యవస్థ
* నాణ్యమైన, శుభ్రమైన ఆహారం కోసం చర్యలు.
* కేంద్రీకృత కేటరింగ్ వ్యవస్థకై టోల్‌ఫ్రీ నెంబర్‌ను మొదలు పెట్టాం.
* విద్యార్థులకు భారత చరిత్రను వివరించేందుకు రైల్వేలు ప్రయత్నం.
* చారిత్రక ప్రదేశాల పర్యటనకు ఆజాద్ ఎక్స్‌ప్రెస్.
* ఆజాద్ ఎక్స్‌ప్రెస్‌లో విద్యార్థుల చార్జీల్లో రాయితీ.
* సరిహద్దులో రైల్వేలైన్లు అత్యంత ప్రాధాన్యం.
* రాజస్థాన్ - భిల్వాడలో మెమో కోచ్ ఫ్యాక్టరీ.
* రాయబరేలీలో కోచ్ ఫ్యాక్టరీ, ఇప్పాత్ నిగమ్‌తో ఒప్పదం.
* రైల్వేలో ఈ ఏడాది లక్షన్నర ఉద్యోగాలు భర్తీ.
* రైల్వేలో సౌర, పవన విద్యుత్ వినియోగానికి ప్రాధాన్యత.
* రైల్వేల్లో ఇకపై గ్రీన్ ఎనర్జీ.
* ఒలింపిక్ పతక విజేత లకు, ద్రోణాచార్య కోచ్‌లకు రైల్వేల్లో ప్రత్యేక పాస్‌లు.
* స్వాతంత్య్ర సమర యోధుల పాసులు మూడేళ్లకోసారి రెన్యువల్.
* ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తాం.
* ప్రభుత్వాన్ని ఈ ఏడాది అదపసే నిధులు అడగడం లేదు.
* ప్రధానంగా 361 పెండింగ్ ప్రాజక్టులకు నిధులు విడుదల చేస్తాం.
* ఈ ఏడాది ప్రయాణికులపై చార్జీల మోత లేదు.
* రైల్వేకు ఉపాధి హామీ అనుసందానం.
* సూపర్ ఫాస్ట్ రైళ్లలో రిజర్వేషన్, క్యాన్సలేషన్ చార్జీల పెంపు.
* సరుకు రవాణా చార్జీలు ఐదు శాతం పెంపు.
* ఇండిపెండెంట్ టారిఫ్ రెగ్యులేటరీ అథారిటీ ప్రతిపాదన.
* ఈ ఏడాది 12 వందల కి.మీ విద్యుదీకరణ
* 2013-14లో 500 కి.మీ కొత్త లైన్లు, 750 కి.మీ డబ్లింగ్ లక్ష్యం.
* పుణ్యక్షేత్రాల కోసం కొత్త రైళ్లు.
* కొత్తగా 27 ప్యాసింజర్ రైళ్లు, 67 ఎక్స్‌ప్రెస్ రైళ్లు.