మోదీ దళిత వ్యతిరేకి.. రాహుల్ సింహగర్జన

posted on: Aug 10, 2018 11:06AM

ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం నిర్వీర్యానికి వ్యతిరేకంగా మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో దళిత సంఘాలు ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో ‘సింహగర్జన’ పేరుతో నిరసన వ్యక్తం చేసారు.. ఈ నిరసనకు సంఘీభావం తెలిపిన రాహుల్ గాంధీ, మోదీపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

 

 

మోదీ దళిత వ్యతిరేక ఆలోచనా ధోరణిని కలిగి ఉన్నారని విమర్శించారు.. 'సంకల్పంతోనే అన్నీ మొదలవుతాయి.. మోదీ హృదయంలో దళితులకు స్థానం ఉంటే, విధానాల రూపకల్పన మరోలా ఉండేది.. తన ప్రసంగాలన్నింటినీ కలిపి గుజరాత్‌లో మోదీ ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు.. పారిశుద్ధ్య పనుల్లో దళితులు ఆధ్యాత్మిక సంతృప్తి పొందుతారని అందులో రాశారు.. ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలకు ఆ మాటలే తార్కాణాలు’ అని అన్నారు.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.. విద్య, దేశాభివృద్ధిలో దళితుల భాగస్వామ్యాన్ని బీజేపీ, ఆరెస్సెస్‌ వ్యతిరేకిస్తాయని విమర్శించారు.. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని తమ పార్టీయే తీసుకొచ్చిందని, ఆ చట్టాన్ని రక్షించి తీరుతామని రాహుల్‌ స్పష్టం చేసారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...