మంగళగిరి ఎయిమ్స్ లో ర్యాగింగ్.. 15 మంది విద్యార్థులపై సస్పెన్షన్ వేటు

posted on: Jul 1, 2025 3:30PM

మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్  కలకలం రేపింది. సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ కారణంగా మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఘటన వెలుగులోనికి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి విచారణ జరిపిన ఎయిమ్స్ అధికారులు 15 మంది సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే విద్యార్థుల సస్పెన్షన్ వార్తలను అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ర్యాగింగ్ కు పాల్పడిన వారిలో ఎయిమ్స్ లోని ఓ కీలక ఉద్యోగి కుమారుడు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఇలా ఉండగా ఎయిమ్స్ లో ర్యాగింగ్ పై పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.  ర్యాగింగ్ ఆరోపణలపై యాంటీ ర్యాగింగ్ కమిటీ దర్యాప్తు జరుపుతోంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...