ఇదే విషయం బీహార్ ప్రజలకు చెప్తాం.. రఘువీరా రెడ్డి

posted on: Oct 16, 2015 5:22PM

ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అయన విలేకరులతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఏపీ ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాస్తానని చెప్పారని తెలిపారు. అంతేకాదు ఈ నెల 22వ తేదీన ఏపీ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.. అదే రోజు కల్లా ఏపీ ప్రత్యేక హోదాపై ఏదో ఒకటి తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఏపీ ప్రజలను మోసం చేశారని.. త్వరలో బీహార్ ఎన్నికల ప్రచారం చేస్తాం.. అప్పుడు ఏపీ ప్రజలకు చేసిన మోసాన్ని బీహార్ ప్రజలకు వివరిస్తామని చెప్పారు. విభజన చట్టంలోని హామీలను కూడా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...