Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రఘురామా రాజీనామా.. జగన్‌పై పోరులో తగ్గేదేలే...
posted on: Jan 7, 2022 1:22PM
వైసీపీ ఎంపీ రఘురామపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే లోక్‌సభ స్పీకర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసింది. అయినా, ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో ఇంకేం చేయాలో తెలీక తెగ ఇదైపోతోంది. నిత్యం రఘురామ పెట్టే టార్చర్‌ను తట్టుకోలేకపోతోంది. పాపం.. వైసీపీ కష్టాన్ని చూడలేకపోతున్నారు రఘురామ. అందుకే, ఆయనే పార్టీకో బంపర్ ఆఫర్ ఇచ్చారు.
వారం రోజులు గడువు ఇస్తున్నా.. తనపై అనర్హత వేటు వేయాలని వైపీపీని ఛాలెంజ్ చేశారు రఘురామ. ఒకవేళ ఈ వారం రోజుల్లో గనుక తనపై వేటు వేయలేకపోతే.. ఆ తర్వాత తానే తన పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటించారు. ఈ స్టేట్‌మెంట్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో సంచలనంగా మారింది.
తాను రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్తానని.. వైసీపీపై ఎంత వ్యతిరేకత ఉందో ఎన్నికల ద్వారా తెలియజేస్తానని రఘురామ సవాల్ చేశారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించేందుకు, రాజధానిగా అమరావతే కొనసాగేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు రఘురామ చెప్పారు.



.webp)


