TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమెరికాలో మరో తెలుగు యువకుడిపై దాడి

Published on: Thu May 4, 2017 12:06PM

అమెరికాలో భారతీయులపై ముఖ్యంగా తెలుగువారిపై జాత్యహంకార దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాషింగ్టన్ డీసీలో తెలుగు యువకుడు సందీప్‌పై ముసుగులు ధరించి వచ్చిన ముగ్గురు నల్లజాతి యువకులు దాడికి తెగబడ్డారు. అనంతరం అతని నుంచి సెల్‌ఫోన్, పర్సు, నగదును దోచుకెళ్లారు. దుండగులు తనను అడ్డుకోగానే వారు దోపిడీకి వచ్చినట్లు గమనించిన సందీప్..మరో మాట లేకుండా తన దగ్గర ఉన్న అన్ని వస్తువులూ ఇచ్చేయడంతో వారు వెళ్లిపోయారు. లేకుంటే వారు తనను హత్య చేసి ఉండేవారని సందీప్ తెలిపారు. ఈ ఘటనపై సందీప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు..