బిజెపి రాజ్యసభ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య
Published on: Mon Dec 9, 2024 2:18PM
త్వరలో జరగబోయే రాజ్యసభ ఉప ఎన్నికలకు గానూ బిజెపి ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. వారిలో ఎపి నుంచి మాజీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజిత్ కుమార్ పేర్లను ప్రకటించింది. గతంలో వైసీపీ తరపున రాజ్యసభ సభ్యులుగా గెల్చిన బిసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడైన ఆర్ కృష్ణయ్య బిజెపిలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమితో బిజెపి పంచన చేరి రాజ్యసభ టికెట్ దక్కించుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు.


