Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏపీ మాజీ మంత్రి నిరవధిక దీక్ష
posted on: Jan 21, 2019 9:49AM

ఏపీలో బీజేపీ,టీడీపీల మధ్య మాటల పోరు కొనసాగుతూనే ఉంది. తాజాగా ఓ మాజీ మంత్రి ఏకంగా నిరవధిక దీక్ష చేపట్టి మరీ టీడీపీ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేత, రాష్ట్ర మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఈరోజు ఉదయం నిరవధిక దీక్షను ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన 56 హామీలనూ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ గత నెల 25న ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత చంద్రబాబుకు అల్టిమేటం పంపించారు. దాదాపు నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో దీక్షను ప్రారంభిస్తున్నానని మాణిక్యాలరావు చెప్పారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకూ తన దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. తన నిరవధిక నిరాహారదీక్ష ద్వారానైనా జిల్లా, నియోజకవర్గానికిచ్చిన హామీలు సీఎం నెరవేర్చాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. పైడికొండల మాణిక్యాలరావు గతంలో టీడీపీ,బీజేపీ కలిసి ఉన్నప్పుడు చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పని చేయటం, అనంతరం పరిణామాలతో ఇరుపార్టీల మధ్య వైరం పెరగటంతో ఆయన తన మంత్రి పదవి కోల్పోయిన సంగతి తెలిసిందే.






