పూరి ఆలయంలో ‘నెయ్యి’ అలర్ట్!

posted on: Sep 25, 2024 12:36PM

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో  కల్తీ నెయ్యి వినియోగం ప్రభావం దేశ వ్యాప్తంగా కనిపిస్తోంది.  ఈ నేపథ్యంలోనే పూరీ జగన్నాథ ఆలయంలో ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి నాణ్యతను పరీక్షించాల్సిందిగా ఒడిశా సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.  పూరి జగన్నాథ ఆలయానికి ఆ రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని ఒడిశా మిల్క్ ఫెడరేషన్ నెయ్యి సరఫరా చేస్తుంది.  మరోవైపు తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలోని ప్రసాదంలో కొవ్వు కూరుకుపోయిందన్న ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...