చరిత్రను తిరగరాసిన పులివెందుల ఎన్నిక.. లతారెడ్డికి చంద్రబాబు అభినందన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత  నారా చంద్రబాబునాయుడు పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో తెలుగుదేశం విజయాన్ని మూడు దశాబ్దాల తరువాత చరిత్రను తిరగరాయడంగా అభివర్ణించారు. పులివెందులలో విజయం సాధించిన తెలుగుదేశం అభ్యర్థి మారెడ్డి లతారెడ్డిని అభినందించిన ఆయన ఈ విజయాన్ని  మీడియా, సోషల్ మీడియా వేదికల ద్వారా   హైలైట్ చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు.

మూడు దశాబ్దాల తరువాత పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని పేర్కొన్న చంద్రబాబు.. ఈ ఎన్నికలో పోటీ చేయడానికి 11 మంది ఔను సరిగ్గా 11 మంది నామినేషన్లు వేయడమే ఇందుకు తార్కానమని చెప్పారు. పదకొండు సంఖ్యను నొక్కి చెప్పడం ద్వారా పరోక్షంగా గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీకి వచ్చిన స్థానాలను వ్యంగ్యంగా ప్రస్తావించారు. ఈ సందర్బంగా బ్యాలెట్ బాక్సులో ఓ ఓటరు తన ఓటుతో పాటు.. 30 ఏళ్లలో తొలి సారి ఓటు వేస్తున్నా.. అందరికీ దండాలు అంటూ ఒక స్లిప్ కూడా వేయడాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. పులివెందుల రాజకీయాలలో ఈ జడ్పీటీసీ ఎన్నిక ఒక చరిత్ర అని చంద్రబాబు పేర్కొన్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu