Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హాస్పిటల్ నుంచి పులివర్తి నాని డిశ్చార్జ్: గన్‌మన్‌కి పరామర్శ!
posted on: May 15, 2024 4:15PM
వైసీపీ దుర్మార్గపు మూకల హత్యాప్రయత్నం నుంచి గాయాలతో తప్పించుకున్న చంద్రగిరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ప్రజల ఆశీస్సులతో కోలుకున్నారు. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ నుంచి పులివర్తి నాని డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన వెంటనే పులివర్తి నాని చంద్రగిరిలో ఉన్న తన గన్‌మాన్ ధరణి ఇంటికి చేరుకున్నారు. ధరణి ఆరోగ్య పరిస్థితిని పులివర్తి నాని అడిగి తెలుసుకున్నారు. గన్‌మన్ ధరణి కుటుంబ సభ్యులకు పులివర్తి నాని చెప్పి, అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పద్మావతి యూనివర్సిటీలో వైసీపీ రాక్షస మూకలు చేసిన హత్యా ప్రయత్నం సందర్భంగా గన్‌మన్, ప్రైవేట్ సెక్యూరిటీ లేకుంటే ఇవాళ తాను ప్రాణాలతో ఉండేవాడిని కాదని చెప్పారు. గన్ మన్, సెక్యూరిటీ
వాళ్లు చూపిన ధైర్యసాహసాలు అభినందనీయమని చెప్పారు. ఓటమి భయంతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు దారుణాలకు తెగబడుతున్నారని పులివర్తి నాని అన్నారు. టీడీపీకి ఓట్లు వేశారని కూచువారిపల్లిలో చిన్న, పెద్ద, ముసలి, ముతకను పట్టుకుని చితక బాదారని, తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇవి మంచి పద్దతులు కావని అంటూ, చంద్రగిరిలో ప్రశాంత వాతావరణం నెలకొనాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.


.webp)
.webp)


