దూకుడు కొనసాగిస్తున్న యువీ, పుజారా
Publish Date:Nov 16, 2012
ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఇండియా మొదటి రోజు దూకుడుని కొనసాగిస్తోంది. రెండో రోజు పుజారా సెంచరీ నమోదు చేయగా, యువరాజ్ అర్థ శతకం పూర్తి చేశాడు. లంచ్ సమయానికి 121 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. ప్రస్తుతం యువీ 72, పుజారా 133 పరుగులతో క్రీజులో ఉన్నారు. 4 వికెట్ల నష్టానికి 323 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో భారత్ రెండోరోజు ఆట ప్రారంభించి౦ది.