Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చిత్తూరులో ప్రేమ ఉన్మాదం..
posted on: Jun 5, 2021 10:11AM
ప్రాంతం ఏదైనా, ప్రభుత్వాలు ఎన్ని మారిన, సమయం ఏదైనా, సందర్భం ఏదైనా, పేరు ఏదైనా గాని నిత్యం ఆడవారిపై అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు కొత్తకొత్త వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా చిత్తూరు నగరంలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదని ఓ ప్రేమోన్మాది కసాయిగా మారి ఆ యువతిని అతి కిరాతకంగా హత్య చేశాడు. విచక్షణ రహితంగా కత్తితో పొడిచి చివరకు తను కూడా గొంతు కోసుకుని పడిపోయాడు.
ఆమె పేరు సుష్మితకు చిన్నప్పటి నుంచి చదువంటే చచ్చేంత ఇష్టం. అందుకే సుష్మిత అప్పులు చేసి మరీ కూతురిని చదివిచారు. పేద వారమైనా.. ఇరుకు ఇంట్లో ఉంటున్నా ఏనాడూ ఇబ్బంది పడలేదు తాను. చదువే తన సర్వాంగ, చదువే తన కష్టాలు తీరుస్తుందని కష్టపడి చదివింది. కానీ శుక్రవారం ఉదయం సుష్మితను చిన్నా అనే యువడుకు గొంతు కోసి చంపేయగా.. ఆమె కుటుంబసభ్యుల చేతిలో చిన్నా హతమయ్యాడు. ఈ ఘటన చిత్తూరు నగరంతో పాటు రాష్ట్రంలోనే తీవ్ర అలజడి సృష్టించింది. ఈ దారుణ ఘటనతో గతంలో జరిగిన ప్రేమోన్మాద దాడులు ప్రజల కళ్లముందు కదలాడాయి. అసలు వివరాలు..
చీలాపల్లి సీఎంసీలో సుష్మిత నర్సుగా పనిచేస్తుంది. డ్యూటీ నిమిత్తం ఆమె సోదరుడు సునీల్ రోజూ మధ్యాహ్నం బైక్‌పై తీసుకెళ్లి.. మరుసటి రోజు ఉదయం ఇంటికి తీసుకొచ్చేవాడు. కట్ చేస్తే.. అదే ప్రాంతానికి చెందిన పని లేని ఒక పోరంబోకు, వాడి పేరు చిన్న సుస్మితను కొంతకాలంగా ప్రేమిస్తున్నాను అంటూ, ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీంతో ఈ ఏడాది జనవరిలో సుస్మిత కుటుంబ సభ్యులు చిన్నాపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఆయినా వాడి ఆగడాలు ఆగలేదు మళ్ళీ చిన్నా వేధింపులపై తిరిగి రెండు నెలల కిందట వరదయ్య మళ్లీ పోలీసులకు చెప్పగా.. పోలీసులు చిన్నాకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా సుస్మితపై పగ పెంచుకుని ఆమెను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు.
ఈ నేపథ్యంలోనే ఆస్పత్రిలో విధులు ముగించుకుని రోజులాగే శుక్రవారం ఉదయం 7.30గంటలకు తన అన్నతో కలిసి సుష్మిత ఇంటికి వచ్చింది. డ్యూటీ చేసి వచ్చిన కూతురికి టీ ఇద్దామని తల్లి తల పాల కోసం కొట్టుకి వెళ్ళింది. పనిలో పని అని టిఫిక్ కోసం సునీల్ హోటల్‌కు వెళ్లాడు. ఊరు వాతావరణం కదా అప్పటికే అప్పటికే సుష్మిత ఒంటరిగా ఉందని పసిగట్టిన చిన్న. పధకం ప్రకారం మిద్దెలు దూకుతూ వెళ్లి సుష్మిత ఇంటి మేడపైకి వెళ్ళాడు. వెనుక ఉన్న మెట్లు దిగి వెంట తెచ్చుకున్న కత్తితో ఇంటి గడియను విరగ్గొట్టాడు.
సౌండ్ లేకుండా లోపలి ఎంటర్ అయ్యాడు. సుస్మిత గాఢనిద్రలో ఉంది. ఒక్కసారిగా తనకు జరిగిన విషయాలు అన్ని గుర్తుకు చేసుకున్నాడు చిన్న.. ఒక్కసారిగా మెరుపు దాడి చేసినట్లు గదిలో నిద్రిస్తున్న సుష్మితపై విచక్షణా రహితంగా దాడి చేసి చంపేశాడు. ఆ రక్తపు మడుగులో పడిఉన్న సుస్మిత చూసి మరి ఆ కసాయి వాడు ఏమనుకున్నాడో అనంతరం అదే గదిలో తానూ కూడా గొంతు కోసున్నాడు. పాలకు వెళ్లిన తల్లి ఇంటికి వచ్చి చూసేసరికి సుష్మిత, చిన్నా ఇద్దరూ రక్తపుమడుగులో ఉండటంతో స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన సునీల్ కొనఊపిరితో ఉన్న చిన్నాను ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి రాయితో తలపై బలంగా కొట్టి చంపేశాడు. ఈ ఘటనపై స్థానికంగా ఉండే మహిళా సంరక్షణ కార్యదర్శి చిత్తూరు వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకొని విచారణ చేపట్టారు. క్లూస్ టీం హత్యకు ఉపయోగించిన కత్తి, ఇతర ఆధారాలను సేకరించింది. చిన్నాను హతమార్చిన సునీల్‌పై పోలీసులు హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



.jpg)


