Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బోరవెల్లి చారిత్రక అన్నవాళ్లు పరిరక్షించుకోవాలి.. ఈమని శివనాగిరెడ్డి
posted on: Mar 7, 2026 4:55PM

జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు మండలం బోరవెళ్లి లోని చారిత్రక ఆనవాళ్లను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. మానోపాడుకు సరిగ్గా పది కిలోమీటర్ల దూరంలో ఉన్న బోరవెళ్లి ప్రముఖ పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, పండితుడుగా, రచయిత సురవరం ప్రతాపరెడ్డి స్వగ్రామం కూడా.
ఆ గ్రామంలో బాదామి చాళుక్యుల కాలం నాటి చండి, చాముండి విగ్రహాలు, చోళులు కాలపు గణపతి విగ్రహం, వీరభద్రాలయం పక్కన ఉన్న కళ్యాణ చాళుక్యుల కాలం నాటి నాగదేవత శిల్పాలు, మరో బురుజు పక్కన ఉన్న కాకతీవీరుల వీరుల శిల్పాలను డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి పరిశీలించారు. వాటి ప్రాముఖ్యతను, ప్రాసస్థ్యాన్నీ గ్రామస్తులకు వివరించారు.
గ్రామ మధ్యలో నున్న బోరవెల్లి సంస్థానం వారు 17వ శతాబ్దిలో విజయనగర వాస్తు శైలిలో నిర్మించిన చెన్నకేశవాలయం, గర్భాలయం, అర్దమండపం, మహా మండపం, మూడు వైపులా ప్రవేశ మండపాలు, ఆలయ అధిష్టానం, గోడలు, కప్పుల పైనున్న విష్ణు దశావతారాలు, నాట్యగత్తెలు, కాళియమర్దన, భైరవుడు, వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, ఏనుగులు, సింహాలు, యాలి శిల్పాలను పరిశీలించారు. వీరభద్రుని గుడికి కొంచెం దూరంలో గల దిగుడు బావి, నిజాం నవాబులు నిర్మించిన కందకంతో కూడిన కోట గోడ, బురుజులు, అసఫ్ జాహి లను, అక్కడే ఉన్న రెండు ఫిరంగులు పరశీలించి అలనాటి రక్షణ వ్యవస్థ పటిష్ఠతను గ్రామస్థులకు వివరించారు.
దాదాపు 1200 సంవత్సరాల వారసత్వానికి అద్దం పడుతున్న బోరవెల్లి చారిత్రక ఆనవాళ్లను కాపాడి భవిష్యత్ తరాలకు అందించాలని శివనాగిరెడ్డి గ్రామస్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రిచంద్రా రెడ్డి, సురవరం గిరిధర్ రెడ్డి, అఖిలభారత పాత దేవాలయాల పునరుద్ధరణ ట్రస్ట్ అధ్యక్షుడు, ఆర్కే జైన్, తెలంగాణ ప్రాజెక్టు కన్సల్టెంట్ ఎండి శ్రీనివాస్ బండ తదితరులు పాల్గొన్నారు.







