Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రేణుకా చౌదరికి ప్రివిలేజ్ నోటీసు
posted on: Feb 16, 2026 7:54AM

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి సభాహక్కుల ఉల్లంఘన నోటీసు జారీ అయ్యింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా పార్టమెంటు ఆవరణలోకి తన కారులో ఒక వీధికుక్కను తీసుకురావడంతో పాటు, ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై రాజ్యసభ ప్రివిలేజ కమిటీ రేణుకా చౌదరికి నోటీసు ఇస్తూ, ఈ నెల 23 లోగా ఈ ఆరోపణలపై లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
గతేడాది డిసెంబర్‌లో జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల సమయంలో రేణుకా చౌదరి.. తాను కాపాడిన ఒక వీధి కుక్కను తన కారులో పార్లమెంటుకు తీసుకొచ్చారు. దీనిపై కొందరు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. లోపల కూర్చున్నవారే కరుస్తారు, కుక్కలు కరవవు అని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారంటూ.. బీజేపీ ఎంపీలు ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు.
దీనిపై ఎంపీలను అవమానించేలా, వారి పరువుకు నష్టం కలిగించేలా రేణుక మాట్లాడారని ప్రివిలేజ్ కమిటీ ఆమెకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది.కాగా ఈ నోటీసుపై రేణుకా చౌదరి కార్యాలయం స్పందిస్తూ, పార్లమెంటరీ నిబంధనలు, సంప్రదాయాలకు అనుగుణంగా రేణుకా చౌదరి సమాధానం ఇస్తామని పేర్కొంది.



.webp)


