Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పంజాబ్ లో రాష్ట్రపతి పాలన? సీఎస్, డీజీపీకి కేంద్రం పిలుపు...
posted on: Jan 6, 2022 6:05PM
ప్రధాన మంత్రి నరేందర్ మోడీ పంజాబ్ పర్యటనలో చోటు చేసుకున్న భద్రతా లోపాలపై దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. మరో వంక రాజకీయ రచ్చ కొనసాగుతోంది. చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రధాని భద్రత విషయంలో పంజాబ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, బీజేపీ నాయకులు ఆరోపిస్తునారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ ఆడుతున్న రాజకీయ డ్రామాగా కొట్టివేస్తున్నారు. మరో వంక పంజాబ్ మాజీ డీజీపీ, ఎస్పీజీ మాజీ డైరెక్టర్ సహా పలువురు భద్రతా వ్యవహరాల నిపుణులు పంజాబ్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే, ప్రధాని భద్రతలో లోపం జరిగిందని అంటున్నారు. ప్రభుత్వం ‘తప్పు’ చేసిందని చాలా స్పష్టంగా చెపుతున్నారు. అంతేకాదు పంజాబీ డీజీపీ, ప్రధాన కార్యదర్శిని ఢిల్లీకి పిలిపించింది కేంద్ర హోంశాఖ. దీంతో పంజాబ్ విషయంలో కేంద్ర సర్కార్ సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
పంజాబ్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ, అమరవీరులకు నివాళులు అర్పించేందుకు బఠిండా విమానాశ్రయం నుంచి ఫిరోజ్’పుర్ వెళుతున్న సమయంలో, ఆ దారిలోని ఫ్లై ఓవర్ ... పై పీఎం కాన్వాయ్ 20 నిముషాలు నిలిచి పోయింది. ఆ తర్వాత ప్రధాని తిరిగి బఠిండా విమానశ్రయం చేరుకొని అక్కడి నుంచి ఢిల్లీ తిరిగి వెళ్ళిపోయారు. ఇది ఎలా చూసినా, అనూహ్యపరిణామం. అయితే అదే సమయంలో సంఘటన పూర్వాపరాలను పరిశీలిస్తే, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటనే తప్ప యాదృచ్చికంగా జరిగిన సంఘటన కాదని, చాలా స్పష్టంగా అర్ధ మవుతుందని అంటున్నారు.
ప్రధాని రాష్ట్రానికి అధికార పర్యటనకు వచ్చినప్పుడు... ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ విమానాశ్రయంలో స్వాగతం పలకడం ప్రాధమిక ప్రోటోకాల్ నిబంధన. కానీ, పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ, విమానాశ్రాయానికి వెళ్ళలేదు. ప్రధానికి స్వాగతం పలకలేదు. అలాగే, సీఎస్, డీజీపీ కూడా ప్రోటోకాల్ పాటించలేదు. అదేమంటే ముఖ్యమంత్రి, కొవిడ్ కారణంగా చూపించారు. ఇటీవల తాను కొవిడ్ పేషెంట్’ను కలిశానని అందుకే, ప్రధానికి స్వాగతం చెప్పేందుకు వెళ్లలేదని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. కానీ, వాస్తవంలో ఆయన ఒక టీవీ చానల్’కు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇలా ముఖ్యమంత్రి ఎందుకు అబద్ధం చెప్పవలసి వచ్చిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రధాని అంతర్గత భద్రాతను చూసే ఎస్పీజీకి, రాష్ట్ర డీజీపీ, రోడ్డు మార్గంలో వెళ్లేందుకు క్లియరెన్స్ ఇచ్చారు. క్లియరెన్స్ ఇచ్చిన తర్వతా కూడా, ప్రధాని కాన్వాయ్’ని 20 నిముషాలు నిరసన కారులు ఆపివేయగలిగారంటే, అదులో ‘ఉద్దేశపూర్వక’ , ‘కుట్ర కోణం’ దాగుందని, అంటున్నారు. అయితే, పంజాబ్ ముఖ్యమంత్రి, ఇంత జరిగితే అసలు ఏమీ జరగనట్లు విచారంతో సరిపెట్టారు.
యూత్ కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుర్జిత్ సింగ్, సుర్జేవాలా, ప్రధాని భద్రతా విషయంలో జరిగిన లోపాన్ని, నాటకంగా వర్ణించడం, రాజకీయ కోణంలో విమర్శలు చేయడం పంజాబ్ ప్రభుత్వం, దురుద్దేశాలను మరింతగా దృవీకరిస్తున్నాయి. ఆలాగే, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్, పాకిస్థాన్ సారిహద్దుల్లో డ్రోన్స్ సంచరిస్తున్నాయని, ఉగ్రవాదుల ద్వారా సరిహద్దుల్లో హింసను ప్రేరేపించేందుకు ఆయుధాలు, మాదక ద్రవ్య్యాలు, డబ్బు సంచులు జారావిడుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన నేపధ్యంలో, పంజాబ్ ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోలేదని స్పష్టమవుతోందని అంటున్నారు.అదే విధంగా ప్రధాని బందోబస్తుకు 10,000 మంది భద్రతా సిబ్బందిని డిప్లాయ్ చేశామని చెపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం 100 మంది నిరసన కారులను అదుపు చేయలేక పోయిందా, అనే ప్రశ్న కూడా వినవస్తోంది.
ఇక ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం, రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ముఖ్యమంత్రి చన్నీ ప్రభుత్వాన్నిడిస్మిస్ చేస్తుందా? రాష్ట్రపతి పాలన విదిస్తుందా? అనేది చూడవలసి వుందని అంటున్నారు.


.webp)
.webp)


