రాష్ట్రపతి పదవిపై శివసేన కన్ను..

 

గతకొద్ది రోజుల్లో రాష్ట్రపతి పదవికాలం ముగియనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ స్థానంలో శివసేన నేత  మోహన్ భగవత్‌ను రాష్ట్రపతిని చేయాలంటూ శివసేన నేతలు భావిస్తున్నారు. అంతేకాదు ఈ విషయంపై మోడీతో కూడా చర్చించినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. కానీ శివసేన మాత్రం ఇప్పటికే కత్తులు చేయడం మొదలుపెట్టింది. బీజేపీ అభ్యర్థిని అంత సులభంగా గెలవనిచ్చేది లేదని శివసేన వర్గాలు అంటున్నాయి. దీనిలో భాగంగానే ప్రతిపక్షాలన్నింటితో ఉద్ధవ్ ఠాక్రే చర్చలు జరుపుతున్నారని సమాచారం. బీజేపీ అయినా, శివసేన అయినా.. తమ లక్ష్యం హిందూ సామ్రాజ్యమేనని చెప్పారు. లౌకిక వాదం అంటే హిందూమతం గురించి మాట్లాడకపోవడం కాదని, ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలు కూడా బీజేపీకి ఓటేశారని గుర్తుచేశారు. శివసేన ఎలక్టొరల్ కాలేజిలో 30వేల ఓట్లు ఉన్న విషయాన్ని బీజేపీ మర్చిపోకూడదని ఆయన చెప్పారు. మరి ఆఖరికి శివసేన పంతం నెగ్గుతుందా.. లేక.. బీజేపీ పంతం నెగ్గుతుందా తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.