మావోయిస్టునేతలను కోర్టులో హాజరుపపరచండి.. కూనంనేని
posted on: Feb 23, 2026 8:37AM
.webp)
నక్సల్ రహిత భారత్ అంటూ ఆపరేషన్ కగార్ కు తెరలేపిన కేంద్రం ఆ లక్ష్యసాధన కోసం క్రూరంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మావోయిస్టు అగ్రనేతలను అరెస్టు చేసి, వారిని చిత్రహింసలకు గురి చేస్తూ లొంగిపోవాలని ఒత్తిడి తెస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
కాగా మావోయిస్టు అగ్రనేతలు పలువురిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారని కొత్తగూడెం ఎమ్మెల్యే ఆరోపించారు. అరెస్టు చేసిన మావోయిస్టు నేతలను లొంగిపోవాలని ఒత్తిడి చేస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని సీపీఐ సీనియర్ నేత, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.
పోలీసులు అరెస్టు చేసిన వారిలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ ఉన్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. వీరిరువురితో పాటు పలువురు మావోయిస్టు నేతలను కూడా పోలీసులు అరెస్టు చేశారని పేర్కొన్న కూనంనేని వారందరినీ వెంటనే కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేశారు.



.webp)



