హోలీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Precautions For Holi, Holi Festival Precautions, Holi Festival Eye Precautions

 

హోలీ వస్తుందంటే పిల్లలలో చెప్పలేని ఆనందం. హోలీ రోజుల రంగు రంగుల రంగులు ఒకరిపై ఒకరు జల్లుకుంటూ, పూసుకుంటూ తెగ హడావుడి చేస్తుంటారు పిల్లలే కాదు పెద్దలు కూడా. పూర్వకాలంలో ఎండాకాలంలో వచ్చే చర్మవ్యాధులు దరిచేరకుండా ఉండేందుకు ప్రకృతిలో దొరికే మొక్కలు, పూలతో రంగులు తయారుచేసుకునేవారు. కానీ ప్రస్తుతం అంత ఖాళీ ఎవరికుంది అందుకనే బజార్లలో దొరికే రంగులతోనే ఆనందిస్తున్నారు. మార్కెట్లలో దొరికే రంగులతో కళ్ళకు వివిధ రకాల జబ్బు వస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. హోలీ ఆడేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు తెలుసుకుందాం ...
* చిన్న పిల్లలలను రంగులకు దూరంగా ఉంచాలి ఒకవేళ ఆడుకుంటుంటే పెద్దవాళ్ళు వారి దగ్గర ఉండాలి.
* రసాయనాలతో తయారైన రంగులు కంట్లోకి వెళితే కార్నియా దెబ్బతిని, చూపు కోల్పోయే ప్రమాదం ఉంది,
రంగుల్లోని ఆమ్లాలు, క్షారాలు వెంటనే తమ ప్రభావాన్ని చూపకపోయినా రాను రాను కంటి చూపును దెబ్బతీస్తాయి.
* గులాల్ లాంటి రంగులు కంట్లోకి వెళ్ళి ఇబ్బందిని కలిగిస్తాయి.
* పెట్రోలియం ఉత్పత్తులను ఉపయోగించి సునేర్ ను ముఖానికి పూసుకుంటారు. అయితే సునేర్ కంట్లోకి వెళితే కంటికి వెంటనే నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువ అందుకే సునేర్ ను వాడకపోవడమే మంచిది.
* రంగులు కంట్లో పడితే వెంటనే శుభ్రమైన చల్లటి నీళ్ళతో కడగాలి.
* కన్ను ఎరుపుగా మరి, మంటపుడితే వెంటనే కంటి వైద్యున్ని సంప్రదించాలి.