Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇక చాలు.. పాలనపై దృష్టి సారించండి...
posted on: May 30, 2018 4:24PM

ఇన్ని రోజులు బీజేపీ ప్రభుత్వంపై.. మోడీపై విమర్శలు గుప్పించిన నటుడు ప్రకాశ్ రాజ్ ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన కర్ణాటక ప్రభుత్వంపై కామెంట్లు విసిరారు. జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, మంత్రి పదవుల కేటాయింపు విషయంలో ఇప్పటి వరకు ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో, మంత్రివర్గం ఇంకా కొలువుదీరలేదు. నేడో, రేపో కేబినెట్ బెర్త్‌లను ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రోజులు గడుస్తున్నా ఇంకా పాలనపై దృష్టి సారించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రకాశ్ రాజ్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వారం రోజులైందని, ఇక పాలనపై దృష్టి సారించాలని... ప్రజలు వారి పాలనను చూడాలనుకుంటున్నారని, కాబట్టి త్వరగా ఆ పనేదో చేయాలని సూచించారు.






