Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దుర్గగుడికి విద్యుత్ సరఫరా నిలిపివేత.. కారణమేంటో తెలుసా?
posted on: Dec 27, 2025 2:04PM

విజయవాడ దుర్గగుడికి విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దుర్గ గుడి విద్యుత్ బకాయిలు 3 కోట్ల ఎనిమిది లక్షల రూపాయల వరకూ పేరుకుపోవడంతో ఏపీసీపీడీసీఎల్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 2023 ఫిబ్రవరి నుంచి దుర్గ గుడి విద్యుత్ బిల్లులు చెల్లించలేదని విద్యుత్ శాఖ తెలిపింది. ఈ బకాయిలపై పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో హెచ్‌టీ లైన్ నుంచి విద్యుత్‌ను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ చర్యపై దేవస్థానం భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని విద్యుత్ సరఫరాన పునరుద్ధరించాల్సిందిగా కోరింది. అలాగే అయితే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సేవలకు అంతరాయం లేకుండా జనరేటర్ల సాయంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. అలాగే విద్యుత్ శాఖ బకాయిల గురించి చెబుతున్నది వాస్తవం కాదని దుర్గగుడి దేవస్థానం పేర్కొంది.
తమ సోలార్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను వినియోగిస్తున్నామని పేర్కొంటూ, నెట్ మీటరింగ్ కోసం విద్యుత్ శాఖను పలుమార్లు కోరినప్పటికీ సాంకేతిక కారణాలంటూ ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఏపీసీపీడీసీఎల్ నమోదు చేయలేదని దేవస్థానం ఆరోపించింది.



.webp)


