Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పవన్‌కు గుడ్ న్యూస్..రాజకీయ పార్టీలకు బ్యాడ్ న్యూస్
posted on: Apr 26, 2016 12:45PM
.jpg)
పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు గుడ్‌న్యూస్. ఆయన స్థాపించిన "జనసేన" కు రాజకీయపార్టీ హోదా దక్కింది. ఇప్పటికే తెలంగాణలో "జనసేన"కు రాజకీయపార్టీగా గుర్తింపు లభించగా, తాజాగా ఏపీలోనూ ఆ పార్టీకి పొలిటికల్ పార్టీ హోదా దక్కింది. ఈ మేరకు నిన్న ఏపీ ఎన్నికల సంఘం..జనసేనను రాజకీయ పార్టీగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ అధినేత పవన్‌కు గుర్తింపుకు సంబంధించిన పత్రాలు చేరాయి. ఆయనతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల సంఘం ఈ పత్రాలను పంపింది. ఇకపై "జనసేన"ను రాజకీయ పార్టీగా పరిగణించాలని ఆ పత్రాల్లో సూచించింది. దీంతో పార్టీ రిజిస్ట్రేషన్ దాదాపుగా పూర్తయినట్లే. అయితే రాజకీయ పార్టీగా గుర్తించినప్పటికి..ఇంకా పార్టీకి గుర్తును మాత్రం ఎన్నికల సంఘం కేటాయించలేదు. అయితే గుర్తు కేటాయింపులో స్వతంత్ర అభ్యర్థుల కంటే జనసేనకు ప్రాధాన్యమిస్తామని ప్రకటించింది. ఈ వార్తతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటుండగా..మిగతా పార్టీలు మాత్రం బరిలోకి మరో కొత్త పార్టీ వచ్చిందని ఫీలవుతున్నారు.






