TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వెంకటరెడ్డికి వ్యతిరేకంగా యాదాద్రిలో పోస్టర్లు

Published on: Sat Aug 13, 2022 11:39AM

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో యాదాద్రి జిల్లాలో పెద్ద సంఖ్యలో పోస్టర్లు వెలిశాయి. కాంగ్రెస్ ద్రోహిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అభివర్ణిస్తూ ఈ పోస్టర్లు వెలిశాయి, ఒక వైపు మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ వెంకటర రెడ్డికి ఏ బాధ్యతలూ అప్పగించని కాంగ్రెస్ ఆయనను ఎన్నికల సమావేశానికి గానీ, టీపీసీసీ చీష్ మునుగోడు నియోజకవర్గంలో చేపట్టనున్న పాదయాత్రకు కానీ ఆహ్వానించకండా దూరంగా ఉంచింద.

అదే సమయంలో కాంగ్రెస్ లో కొందరు తనను దారుణంగా దూషిస్తున్నారనీ, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారనీ వెంకటరెడ్డి ఆరోపిస్తున్నారు. తనను విమర్శించిన వారూ, విమర్శల వెనుక ఉన్నవారూ క్షమాపణ చెప్పాలనీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

కాగా కోమటి రెడ్డి డిమాండ్ మేరకు టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెబుతూ ట్విట్టర్ వేదికగా ఒక వీడియో విడుదల చేశారు. దీంతో మునుగోడు ఉప ఎన్నిక ముందు వివాదానికి తెరపడుతుందనుకుంటే.. యాదాద్రి జిల్లాలో వెంకటరెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి.

వెంకటరెడ్డిని కాంగ్రెస్ ద్రోహిగా అభివర్ణిస్తూ వెలిసిన ఈ పోస్టర్ల వెనుక ఎవరున్నారన్నది తెలియరాలేదు. అయినా కాంగ్రెస్ లో వెంకటరెడ్డి వ్యతిరేక వర్గీయులే ఈ పోస్టర్లు వేసి ఉంటారని బావిస్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ అంశానికి ఇప్పట్లో తెరపడే అవకాశాలు లేవని పరిశీలకులు అంటున్నారు,