ఒక్కరోజులోనే లక్షకు పైగా కేసులు.. థ‌ర్డ్ వేవ్ వ‌చ్చేసిన‌ట్టే...

posted on: Jan 7, 2022 10:40AM

కొవిడ్ మ‌ళ్లీ క‌ల్లోలం రేపుతోంది. దేశంలో రోజుకు ల‌క్షకు పైగా కేసులు వ‌స్తున్నాయి. థ‌ర్డ్ వేవ్ వ‌చ్చేసిన‌ట్టే అంటున్నారు. దేశంలో కొవిడ్ పాజిటివ్ కేసులు 10 రోజుల్లో 13 రెట్లు పెరిగాయి. గురువారం ఒక్క‌రోజే 1,17,100 మందికి పాజిటివ్ రాగా.. ఇందులో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3వేలు. 

రోజువారీ పాజిటివిటీ రేటు 7.74 శాతానికి చేరింది. మహారాష్ట్రలో 36,265 మంది కొవిడ్‌ బారిన పడగా.. ముంబై న‌గ‌రంలోనే 20,181 కేసులు వ‌చ్చాయి. బెంగాల్‌లో 15,421, ఢిల్లీలో 15,097 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో పాజిటివిటీ రేటు ఏకంగా 15.34% శాతానికి పెరిగింది. 

మ‌రోవైపు, ఒమిక్రాన్ వేరియంట్‌ సైతం వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం అధికారికంగా 3,007 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. ఇక అన‌ధికారిక కేసుల సంఖ్య ఇంకా చాలానే ఉండే అవ‌కాశం ఉంది. ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్రలో 876.. ఢిల్లీలో 465 న‌మోద‌య్యాయి. 
 

google-ad-img
    Related Sigment News
    • Loading...