TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ కి చెప్పే ధైర్యం ఉందా? పొన్నాల

Published on: Thu Jun 25, 2015 3:45PM

రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు వ్యవహారంపై టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మొదటిసారి నోరు విప్పారు. ఇన్ని రోజులు ఈ వివాదంఫై ఎలాంటి వ్యాఖ్యలు చేయని ఆయన ఇప్పుడు ఇద్దరు సీఎంల వైఖరిపై మండిపడ్డారు. కేసీఆర్ కు చంద్రబాబుకు సెక్షన్ 8 గురించి విభజన సమయంలోనే బాగా తెలుసని అన్నారు. ఈ కేసులో ఏపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ట్యాపింగ్ చేయలేదని ధైర్యంగా చెప్పగలరా? అలా చెప్పే దమ్ము కేసీఆర్ కు ఉందా? అని ప్రశ్నించారు.