ముగిసిన 'పంచాయితీ'..ఓ చోట అపశృతి

posted on: Jan 21, 2019 1:14PM

 

తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. మొదటి విడత ఎన్నికలు జరిగే 4,479 పంచాయతీల్లో 769 పంచాయతీలు.. 39,822 వార్డుల్లో 10,654 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3,701 పంచాయతీలు, 28,976 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 12,202 మంది సర్పంచి అభ్యర్థులు, వార్డులకు 70,094 మంది బరిలో నిలిచారు. 12 గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 75 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

మరోవైపు ఈ ఎన్నికల్లో ఓ చోట అపశృతి చోటు చేసుకుంది. విధులు నిర్వహిస్తున్న ఎన్నికల ఏజెంట్‌ ఒకరు గుండెపోటుతో మరణించారు. వివరాల్లోకి వెళ్తే విలాస కవి సత్యం రాజు(70) సూర్యపేట జిల్లా మునగాల మండలం ఆకు పాముల గ్రామంలో ఎన్నికల ఏజెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో ఉండగా.. గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం కోదాడకు తరలిస్తుండగా దురదృష్టావషాత్తు మార్గమధ్యలోనే మరణించాడు.

google-ad-img
    Related Sigment News
    • Loading...