మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్‌

posted on: Dec 7, 2018 3:39PM

 

ఈరోజు ఉదయం 7 గంటలకు తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాజాగా 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో పోలింగ్‌ ప్రక్రియ కూడా ముగిసింది. మిగతా 106 నియోజకవర్గాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గంట ముందుగానే పోలింగ్‌ ముగిసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో క్యూలైన్లలో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఐదు, ఖమ్మం జిల్లాలో ఐదు, వరంగల్‌ జిల్లాలో రెండు, కరీంనగర్‌ జిల్లాలో ఒక నియోజకవర్గాన్ని ఎన్నికల సంఘం అధికారులు సమస్యాత్మక స్థానాలుగా గుర్తించి 4గంటలకే పోలింగ్‌ను ముగించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

పోలింగ్ ముగిసిన నియోజకవర్గాలు

సిర్పూర్‌
చెన్నూర్‌ 
బెల్లంపల్లి 
మంచిర్యాల
ఆసీఫాబాద్‌ 
భూపాలపల్లి
ములుగు
పినపాక 
ఇల్లెందు
అశ్వారావుపేట
కొత్తగూడెం
భద్రాచలం
మంథని

google-ad-img
    Related Sigment News
    • Loading...