Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కాంగ్రెస్ లో చిరంజీవి ఫ్లెక్సీ వివాదం
posted on: May 22, 2013 3:05PM

కేంద్ర పర్యాటక మంత్రి, మెగాస్టార్ చిరంజీవి ఫోటోకు ముఖ్యమంత్రి వర్గం చెక్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరుగుతున్న చోట ఫ్లెక్సీలలో ఆయన ఫోటోకు చోటు లభించలేదు. దీంతో చిరు వర్గం నేత, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌతం ఈ వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేశాడు. సమన్వయ కమటీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత అయిన చిరంజీవి ఫోటో ఇలాంటి ముఖ్యమయిన కార్యక్రమంలో పెట్టకపోవడం ఏంటని ప్రశ్నించారు. అయితే చిరంజీవి ఫోటో పెట్టకపోవడం తప్పిదమేనని, భవిష్యత్ లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని రాష్ట్ర కార్మిక మంత్రి దానం నాగేందర్ సర్ధిచెప్పారు. అయితే ముందస్తు వ్యూహం ప్రకారమే ముఖ్యమంత్రి వర్గం చిరు ఫోటోను దూరం పెట్టిందని తెలుస్తోంది.






