TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీజేపీకి 10 సీట్లు వస్తే రాజకీయ సన్యాసం.. కేజ్రీవాల్

Published on: Sat Feb 28, 2026 4:52AM

బీజేపీకి ధైర్యముంటే దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు పెట్టాలని, ఆ పార్టీకి పది స్థానాలకంటే ఎక్కువ వస్తే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. లిక్కర్ పాలసీపై తప్పుడు కేసు పెట్టి ఆమ్ఆద్మీ పార్టీని అంతం చేయాలని ప్రధాని మోడీ, అమిత్ షాలు కుట్ర పన్నారని కేజ్రీవాల్ ఆరోపించారు.

సీబీఐ నమోదు చేసిన కేసులో తనతో పాటు అందరికీ క్లీన్ చిట్ ఇస్తూ న్యాయస్థానం చారిత్రక తీర్పు ఇచ్చిందన్నారు. సిబీఐ కోర్టు తీర్పు అనంతరం మనీశ్ సిసో డియా, ఆప్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన..  ఈ వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన కేసులనూ డిశ్చార్జ్ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఢిల్లీ మొత్తం నాశనమైందని ఈ సందర్భంగా కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. అధికారం కోసం మోడీ, షాలు కుట్రలు పన్నారని, ఆ పర్యవసానాలను ఢిల్లీ ప్రజలు అనుభవిస్తున్నారని మండిపడ్డారు.