పోలీసులు అడుగుపెట్టడానికి వీల్లేదు

posted on: Feb 23, 2016 9:01AM

 

- జేఎన్‌యూలో జరిగిన వివాదాస్పద సంఘటనకు సంబంధించి పోలీసులు ఒక అయిదుగురు విద్యార్థుల కోసం కొద్ది రోజులుగా వెతుకుతున్నారు.

 

- కన్నయా కుమార్‌ అనే విద్యార్థి నాయకుడిని అరెస్టు చేసిన తరువాత నుంచీ ఈ విద్యార్థులు అజ్ఞాతంలోకి జారుకున్నారు.

 

- అయితే ఆదివారం రాత్రి అనూహ్య పరిస్థితులలో ఈ అయిదుగురూ తిరిగి విశ్వవిద్యాలయంలో కనిపించారు.

 

- ఇంతకు ముందు ఒకసారి పోలీసులను క్యాంపస్‌లోకి అనుమతించినందుకు వివిధ వర్గాల కోపాన్ని చవిచూసిన విశ్వవిద్యాలయపు యాజమాన్యం ఈసారి ఆచితూచి స్పందిస్తోంది.

 

- ఈ విషయమై ఉప కులపతి ఎం.జగదీశ్‌ కుమార్‌ 300 మంది ఉపాధ్యాయులతో కలిసి నిన్న చర్చించారు.

 

- భవిష్యత్తులో నింద తమ మీద పడకుండా ఉండాలంటే పోలీసులను ఎట్టి పరిస్థితులలోనూ విద్యాలయం క్యాంపస్లోకి అనుమతించరాదని నిర్ణయించారు.

 

- ఇటు పోలీసులు కూడా బలవంతంగా విశ్వవిద్యాలయం లోపలకి వెళ్లే మరో వివాదంలో ఇరుక్కునేందుకు సిద్ధంగా లేరు.

 

- నిందితులైన విద్యార్థులు మాత్రం విశ్వవిద్యాలయంలో సురక్షితంగా ఉన్నారు. తమంతట తాము బయటకు వెళ్లి లొంగిపోయేందుకు వారు సిద్ధంగా లేరు.

 

google-ad-img
    Related Sigment News
    • Loading...