టోల్ గేట్ వద్ద.. 26 కిలోల గోల్డ్ .. 

posted on: Mar 24, 2021 5:07PM

స్మగ్లర్లు రూట్ మార్చారు. విమానాశ్రయాల్లో తనికీలు స్ట్రిక్ అయ్యావడంతో గోల్డ్ స్మగ్లింగ్ కి ఆటంకంగా మారిందని. స్మగ్లర్లు నేరుగా టేక్ ఏ వై తో బై రోడ్టోపై వస్తున్నారు. రూట్ మార్చిన కేటుగాలకు టోల్ గేట్ వద్ద పోలీసుల వేటు తప్పలేదు.   

తాజాగా చౌటుప్పల్ టోల్ గేట్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కోల్‌కతా నుంచి చెన్నైకి తీసుకెళ్తున్న ముగ్గురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తనిఖీల్లో భాగంగా భారీగా బంగారం పట్టుబడింది. రూ.12 కోట్ల విలువైన 26 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని చెన్నైలో  డెలివరీ చేయాలంటూ మాఫియా ముఠాకు అప్పగించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. కారు ఎయిర్‌బ్యాగ్‌లో బంగారం బిస్కెట్లు తరలిస్తున్నట్లు గుర్తించారు. విదేశాల నుంచి బంగారం ఎలా వచ్చింది? హైదరాబాద్‌లో ఎవరికి ఇచ్చేందుకు తీసుకెళ్తున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 

google-ad-img
    Related Sigment News
    • Loading...