బుద్ధి లేని అమ్మాయి.. ఆమె ప్రియుడిపై ప్రజాధనం వృధా కేసు

posted on: Aug 29, 2022 9:56AM

భర్తతో వెళ్లి విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన సాయిప్రియ ఆమె ప్రియుడు రవితేజపై పోలీసులు కేసు నమోదు చేశారు. రూ. కోటి ప్రజాధనం వృధాకు కారణమయ్యారంటూ కేసు పెట్టారు.  సాయిప్రియ, రవితేజపై ప్రభుత్వ ధనం, సమయం వృథా చేసినందుకు కోర్టు అనుమతితో పోలీసులు కేసు నమోదు చేశారు. సాయిప్రియ చేసిన పనికి విలువైన ప్రజాధనంతో పాటు నేవీ, కోస్ట్‌గార్డ్‌, పోలీసుల సమయం వృథా అయ్యిందంటున్నారు పోలీసులు. మరోవైపు, తనకు భర్త ఉండగానే అతడ్ని మోసగించి వేరొకరిని పెళ్లి చేసుకుని ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందున ఆమెపై చర్యలకు దిగాలనుకున్నారు త్రీటౌన్‌ పోలీసులు.

అసలు విషయమేమిటంటే.. విశాఖ‌ప‌ట్నానికి చెందిన 21 ఏళ్ల సాయిప్రియకు 2020లో వివాహమైంది. భ‌ర్త శ్రీ‌నివాస‌రావు హైద‌రా బాద్‌లో ఒక ఫార్మాకంపెనీలో ప‌నిచేస్తున్నాడు. త‌మ మ్యారేజ్ యానివ‌ర్స‌రీ జ‌రుపుకోవ‌డానికి అత‌ను విశాఖ వెళ్లా డు. ఆరోజు సాయింత్రం అలా బీచ్‌కీ  తీసికెళ్లాడు. బీచ్ అన‌గానే స‌ర‌దాగా గ‌డ‌ప‌డ‌మే క‌దా.  ఏవో నాలుగు క‌బుర్లు, రెండు ఐస్క్రీమ్ ల‌తో  సాయింత్రం గ‌డిపేయ‌చ్చ‌ని, మాట్లాడుకోవ‌చ్చ‌ని వాళ్లి ద్ద‌రే వెళ్లారు. కొంత సేప‌టికి  శ్రీ‌నివాస్‌కి  ఫోన్ వ‌చ్చి కొద్దిగా అవ‌త‌ల‌కి న‌డుస్తూ ఫోన్ మాట్లాడాడు. అయి పోయి  వెనక్కి తిరిగి చూస్తే భార్య సాయిప్రియ  క‌న‌ప‌డలేదు. రాకాసి అల లాక్కెళ్లిందేమో అని భ‌య‌ప‌డ్డాడు. బీచ్ అంతా  క‌ల‌య తిరి గాడు. కానీ ఎక్క‌డా ఆమె జాడ లేదు. అంతే అక్క‌డి పోలీసులు రంగంలోకి దిగారు. అంతా  వెతికినా వారికీ క‌నిపించ‌లేదు. ఏకంగా శ్రీ‌నివాస్ నే  కొంత‌మంది అనుమానించారు. 

యావ‌త్ విశాఖ ఖంగారెత్తింది.  శ్రీ‌నివాస్ అత్తింటివారు, స్నేహితులు జ‌ల్లెడ ప‌ట్టినా ఆ అమ్మాయి చున్నీ కూడా దొర‌క‌లేదు. ఇదేం మాయ‌రా నాయ‌నా అని అనుకున్నారు. బాద‌పడ్డా రు. అంత‌లో ఒక‌వేళ నిజంగానే ఏదో పెద్ద అలా స‌ముద్రంలోకి లాక్కెళ్లిందేమోన‌ని సందేహాలు వ్య‌క్త‌మ య్యాయి. చాలామంది అదీ జ‌ర‌గ‌వ‌చ్చ‌నుకున్నారు. అంతే వెంట‌నే భ‌ద్ర‌తాద‌ళాలు, హెలి కాప్ట‌ర్ల‌తో  సిద్ధ మ‌య్యారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లకూ ఇది మ‌రింత ఆసక్తిక‌ర అంశ‌మైంది.

అమ్మాయి దొర‌క‌లేదు గాని కోటిరూపాయ‌ల ఖ‌ర్చు అయింది. ఆ త‌ర్వాత ఆ అమ్మాయి నుంచి వీడియో కాల్ వ‌చ్చింద‌ని అమ్మాయి తండ్రే పోలీసుల‌కు చెప్పారు. విష‌య‌మేమంటే, ఆమెగారికి ఈ పెళ్లి ఇష్టం లేదు. ర‌వి అనే అబ్బాయిని విశాఖ‌లో ప్రేమించింది. అత‌నితో  బంగ‌ళూరులో ఉంది. అక్క‌డికి వెళ్ల‌డా నికి పెద్ద స్కెచ్ వేసింది. దానికి బ‌ల‌యింది శ్రీ‌నివాస్‌, త‌ల్లిదండ్రుల ప‌రువు.  ప్ర‌జాధ‌నం కోటి రూపాయ‌ ల ఖ‌ర్చు.  మ‌రో షాకింగ్ సంగ‌తేమిటే, ఆ రోజు బీచ్‌కి స‌ద‌రు ప్రేమికుడు కూడా రావ‌డం!  అంతా తెలిసిన తరువాత పోలీసులు ఇప్పుడు సాయిప్రియ, ఆమె ప్రియుడిపై కేసు నమోదు చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...