Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పోలీసుల అదుపులో వల్లభనేని వంశీ అనుచరులు!
posted on: Nov 19, 2024 9:51AM
.webp)
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. గన్నవరంలోని తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు వల్లభనేని అనుచరులైన ముగ్గురిని అదుపులోనికి తీసుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెలుగుదేశం కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడి సూత్రధాని వంశి అన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో కార్యాలయ ఆవరణలోని కారు దగ్ధం చేశారు. కార్యాలయంలోని సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే జగన్ సర్కార్ అధికారంలో ఉన్నంత కాలం కేసు దర్యాప్తు నత్తనడకన సాగింది. కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన పోలీసులు ఒక దశలో వంశీ అరెస్టుకు కూడా రంగం సిద్ధం చేశారు. ఆయన అందుబాటులోకి రాకపోవడంతో లుక్ ఔట్ నోటీసులు జారీ చేయడానికి కూడా రెడీ అయ్యారు. అయితే కోర్టు నుంచి రక్షణ పొందిన వంశీ అరెస్టును తాత్కాలికంగా తప్పించుకోగలిగారు. తాజాగా ఆయనకు అత్యంత సన్నిహితులైన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయడంతో వంశీ అరెస్టు కూడా అనివార్యమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తె
లుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ నేరుగా పాల్గొనకపోయినా, కార్యకర్తలను ప్రేరేపిం చింది వంశీయేనని పోలీసులు గట్టిగా చెబుతున్నారు. వైసీపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నంత కాలం గన్నవరంలో పోలీసులు వంశీ సొంత మనుషుల్లా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ కారణంగానే గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరవాత పోలీసులు ఈ కేసు దర్యాప్తులో వేగం పెంచారు. పలువురిని అరెస్టు చేశారు. ఒక దశలో వల్లభనేని వంశీని కూడా అరెస్టు చేశారన్న వార్తలు వచ్చాయి. అయితే అవేమీ వాస్తవం కాదని తేలింది. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు వంశీ అనుచరులైన ముగ్గురిని అరెస్టు చేశారు. వారిని విచారించి తదుపరి వంశీని కూడా విచారణకు రావలసిందిగా నోటీసులు ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు, మొత్తం మీద ఒకింత ఆలస్యమైనా వంశీ పాపాల పుట్ట పగలడం ఖాయమని, కటకటాలు లెక్కించక తప్పదని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి.


.webp)



