సోష‌ల్ మీడియాపై ఉక్కుపాదం!.. యూట్యూబ‌ర్స్‌పై థ‌ర్డ్ డిగ్రీ!

posted on: Jan 7, 2022 11:00AM

అంద‌రి చేతిలో సెల్‌ఫోన్‌. నెట్ స‌ర్ఫింగ్ చేస్తే కావ‌ల‌సినంత ఇన్ఫ‌ర్మేష‌న్‌. నేత‌ల గుట్టంతా సోష‌ల్ మీడియాలో బ‌ట్ట‌బ‌య‌లు అవుతోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఏదో ఒక పార్టీకి కొమ్ము కాస్తుండ‌టంతో.. యూట్యూబ్‌, వెబ్‌సైట్లు మాత్ర‌మే కీల‌క నేత‌ల‌ను, రాజ‌కీయ అంశాల‌ను ట‌చ్ చేసే సాహ‌సం చేస్తున్నాయి. ఇదే ఇప్పుడు ప్ర‌భుత్వాల‌కు క‌ళ్ల‌మంట‌గా మారిందంటున్నారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ సోష‌ల్ మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నారు. లేటెస్ట్‌గా తెలంగాణ స‌ర్కారు ప‌లు యూట్యూబ్ ఛానెల్స్‌పై దండెత్తింది. ప్ర‌భుత్వ వ్య‌తిరేఖ క‌థ‌నాలు, కేసీఆర్‌, కేటీఆర్‌, క‌విత‌ల‌కు యాంటీగా న్యూస్ ఇస్తున్న వాళ్ల‌నే ప్ర‌ముఖంగా టార్గెట్ చేశార‌ని తెలుస్తోంది. ముందుగా 45 యూట్యూబ్ ఛానెల్స్‌తో లిస్ట్ రెడీ చేసుకున్నార‌ట‌. అందులో చాలా మందికి నోటీసులు ఇచ్చారు. కొంద‌రిని అదుపులోకి తీసుకొని.. స్టేష‌న్లో కుమ్మేశార‌ని అంటున్నారు. 

ఇక్క‌డే స‌ర్కారు డివైడ్ అండ్ రూల్ పాల‌సీ అప్లై చేసింద‌ని మండిప‌డుతున్నారు. రేవంత్‌రెడ్డినో, బండి సంజ‌య్‌నో, ఈట‌ల రాజేంద‌ర్‌నో తిట్టిపోసే సోష‌ల్ మీడియా ఛానెల్స్‌కి ఎలాంటి నోటీసులు ఇవ్వ‌లేదు. టీఆర్ఎస్‌ను, కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసిన వారే పోలీసుల టార్గెట్‌గా మారార‌ని తెలుస్తోంది. నోటీసులు అందుకున్న వారిలో చాలామంది హుజురాబాద్ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారంటున్నారు. వారిలో కేటీఆర్‌, క‌విత‌ల‌ను ప‌ర్స‌న‌ల్‌గా టార్గెట్ చేసి.. కాస్త స్పైసీగా న్యూస్ రాసిన వారిని గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. రాత్రి వారిని చిత్ర‌హింస‌లకు గురి చేశార‌ని టాక్‌. ప్ర‌త్యేకంగా ఓ ఐదుగురు యూట్యూబ‌ర్స్‌పై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించార‌నే ఆరోప‌ణ‌లు వస్తున్నాయి.  

ఆ ఐదుగురిలో ఇద్ద‌రు గ‌తంలో కేసీఆర్ కూతురు క‌వితకు చెందిన సంస్థ‌లో ప‌ని చేసిన వార‌ని స‌మాచారం. క‌విత ద‌గ్గ‌ర నుంచి వ‌చ్చేసి.. సొంతంగా ఛానెల్ పెట్టుకొని.. ఆమెపై వార్త‌లు రాస్తుండ‌టంతో ప్ర‌గ‌తి భ‌వ‌న్ సీరియ‌స్‌గా స్పందించిందని చెబుతున్నారు. శ్రీనివాస్ దాస‌రి, శ‌ర‌త్‌గౌడ్ అనే ఆ ఇద్ద‌రిని రాత్రి స్టేష‌న్లో ఫుల్‌గా టార్చ‌ర్ చేశార‌ని అంటున్నారు. అయితే, ఈ విష‌యం బ‌య‌ట‌కు లీక్ కావ‌డం.. మిగ‌తా మీడియా నుంచి ప‌దే ప‌దే ఫోన్లు రావ‌డం.. విప‌క్షాలు రియాక్ట్ కావడం.. కేసుల వ‌ర‌కూ వెళితే క‌విత గుట్టంతా బ‌య‌ట‌పెడ‌తార‌నే భ‌య‌మో ఏమో కానీ.. అర్థ‌రాత్రి దాటాక వారిద్ద‌రినీ వ‌దిలి పెట్టేశారు. ఇంకోసారి ఇష్టం వ‌చ్చిన‌ట్టు న్యూస్ పెడితే.. టార్చ‌ర్ మ‌రో రేంజ్‌లో ఉంటుంద‌ని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చి పంపించార‌ని తెలుస్తోంది. 

సోష‌ల్ మీడియాపై పోలీస్ యాక్ష‌న్ ఈ ఒక్క రోజుతో ముగిసేది కాద‌ని.. ఇది ఇక‌పై కంటిన్యూయ‌స్ ప్రాసెస్ అని అంటున్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక వార్త‌లు ఇస్తున్న ఛానెల్స్ పేర్ల‌న్నీ సేక‌రించి పెట్టుకున్నార‌ని.. అందులో మ‌రీ స్ట్రాంగ్‌గా కేసీఆర్‌-కేటీఆర్‌-క‌విత‌-సంతోష్‌ల‌పై విమ‌ర్శ‌లు చేస్తున్న వారికి నోటీసులు ఇచ్చి.. అందులో మ‌రో ఐదుగురికి లాఠీ రుచి చూపించార‌ని చెబుతున్నారు. అంతేకాదు.. ప్ర‌తీ పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో ఓ సీఐ ఆధ్వ‌ర్యంలో సోష‌ల్ మీడియా మోనిట‌రింగ్ సెల్ ఏర్పాటు చేశార‌ని తెలుస్తోంది. ఆ స్పెష‌ల్ టీమ్ ప‌ని.. కేసీఆర్ వ్య‌తిరేక న్యూస్ ఇచ్చే వారి భ‌ర‌తం ప‌ట్ట‌డ‌మేన‌ని అంటున్నారు. ఇదంతా నేరుగా కేటీఆర్‌, క‌విత‌, సంతోష్‌ల డైరెక్ష‌న్‌లో జ‌రుగుతోంద‌ని టాక్‌. 

ఇలా సోష‌ల్ మీడియాపై ఉక్కుపాదం మోప‌డంపై కేసీఆర్ చూసీచూడ‌న‌ట్టు ఉంటున్నార‌ని అంటున్నారు. కేటీఆర్‌ను సీఎం చేయాల‌నేది కేసీఆర్ ల‌క్ష్యం. అందుకు, సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న కంటెంట్ కేటీఆర్ ఇమేజ్‌ను బాగా డ్యామేజ్ చేసేలా ఉంటోంది. అటు, క‌విత‌ను సైతం ప‌లు ప్లాట్‌ఫామ్స్‌పై టార్గెట్ చేయ‌డాన్ని కేసీఆర్ త‌ట్టుకోలేక‌పోతున్నార‌ని తెలుస్తోంది. ఇన్నాళ్లూ త‌న‌ను నానామాట‌లు అంటున్నా ఓపికప‌ట్టా గానీ.. త‌న కొడుకూ, కూతురుపైనా సోష‌ల్ మీడియాలో విప‌రీత వార్త‌లు వ‌స్తుండ‌టంపై కేసీఆర్ క‌న్నెర్ర చేశార‌ని స‌మాచారం. ఆయ‌న కోప‌మే.. ఇలా ఒక్క‌సారిగా ప‌దుల సంఖ్య‌లో సోష‌ల్ మీడియా ఛానెల్స్‌పై పోలీసుల దాడులు.. అనేక మందికి నోటీసులు.. కొంద‌రిపై థ‌ర్డ్ డిగ్రీ...అంటున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...