Latest News

ఈ దాడుల మర్మ‌మేమీ మోదీజీ?

posted on: Jun 15, 2022 3:59PM

బిజెపి ప్రైవేటు ద‌ళంలా  పోలీసులు త‌మ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యం మీద దాడి చేసి బ‌ల‌వంతంగా లోప లికి వ‌చ్చి కార్య క‌లాపాల‌ను అడ్డుకోవ‌డ‌మేకాకుడా, కార్య‌క‌ర్త‌ల‌ను చిత‌క‌బాద‌డం ప‌ట్ల కాంగ్రెస్ బిజెపి ని దుమ్మెత్తి పోస్తోంది. బుధ‌వారం ఊహించ‌ని విధంగా పెద్ద సంఖ్య‌లో పోలీసులు, భద్రతా బలగాలు పార్టీ కార్యాల‌యంలోకి చొచ్చుకు వ‌చ్చి త‌మ కార్య‌క‌ర్త‌ల‌ను కొంద‌రిని అకార‌ణంగా తీసికెళ్లార‌ని కాంగ్రెస్ ఎంపి కార్తి పి.చిదంబ‌రం ట్విట‌ర్‌లో ఆరోపించారు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను కూడా ఆయ‌న ట్విట‌ర్ వీక్ష‌కుల‌కు పంచారు. ఢిల్లీ పోలీసులు బిజెపి ప్ర‌యివేటు మిలిషియా గా వ్య‌వ‌హ‌రించార‌ని ఎం.పీ ఆరోపించారు. 

కాంగ్రెస్ కార్యాల‌యం నుంచి అధికార ట్విట‌ర్‌లోనూ అదే వీడియోను విడుద‌ల చేశారు.  ఎవరు పోస్టు చేశారో తెలియని ఆ వీడియోలో ప్ర‌ధాని మోదీని డిక్టేట‌ర్‌గా అభివ‌ర్ణించారు. ఇటువంటి గూండాగిరీ, దాడులు చేప‌ట్టే ప‌క్షంలో ప్ర‌జాస్యామ్య బ‌ద్ధంగా దేశాన్ని ప‌రిపాలించే కుర్చీ మీద నుంచి దిగి, ధైర్యం వుంటే ప్ర‌జ‌ల స‌మ‌క్షంలోకి రావాల‌ని డిమాండ్ చేసేరు.  కొంత హిందీలో కూడా మాట‌లు వినిపించాయి. కాంగ్రెస్ కార్యాల‌యానికి గూండాల‌ను పంప‌డం ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేయ‌డ‌మే అవుతుంద‌ని  ట్వీట్‌లో అన్నారు. అందులో ఒక వ్య‌క్తి  కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలోకి అస‌లు మీరు ఎందుకు దౌర్జ‌న్యంగా ప్ర‌వేశించార‌ని పోలీసు అధికారిని ప్ర‌శ్నించ‌డం క‌నిపించింది. అత‌ను ఇంకా త‌న ఫోన్‌లో రికార్డింగ్ చేస్తుండ‌గాన్నే అత‌న్ని పోలీసులు అవ‌త‌ల‌కి లాక్కెళ్లారు. 

ఇదిలా వుండ‌గా అస‌లు తాము కాంగ్రెస్ ప్ర‌ధాన కార్యాల‌యంలోకి బ‌ల‌వంతంగా దూసుకు వెళ్ల‌నేలేద‌ని పోలీసులు అంటున్నారు. కార్యాల‌యం వ‌ద్ద‌నే చాలా మంది పోలీసు బ్యారీకెడ్‌ల‌ను తీసి విసిరేర‌ని, అందు వ‌ల్ల కొంత ఘ‌ర్ష‌ణ జ‌రిగింద‌ని   పోలీసు అధికారి ఒక‌రు అన్నారు. అస‌లు పోలీసులు  ఆ పార్టీ కార్యాల యంలోకి  వెళ్ల‌నే లేద‌ని, లాఠీఛార్జీ చేయ‌లేద‌ని అన్నారు.  కాగా, పోలీసులు ఈ విధంగా దూసుకు రావ‌డం గురించి  కె.సి.వేణుగోపాల్‌, భూపేష్ బాఘేల్‌, ర‌ణ‌దీప్ సూర్జీవాలా, అధిర్ రంజ‌న్ చౌద‌రీ త‌దిత‌ర కాంగ్రెస్ నాయ‌కులు కాంగ్రెస్ ప్ర‌ధాన కార్యాల‌యంలో చ‌ర్చించారు. అస‌లు దేశంలో ప్ర‌తిప‌క్షం మీద అన్ని విధాలా దాడులు చేయ‌డానికి మోదీ ప్ర‌భుత్వం పూనుకున్న సం గ‌తి ఈ విధంగానూ స్ప‌ష్ట‌మ‌యింద‌ని కాంగ్రెస్ నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దేశ  చ‌రిత్ర‌లో  ఒక పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యం మీద ఇంత‌లా దాడి చేయించ‌డం ఇదే  మొద‌టిసారి  అని కాంగ్రెస్ ముఖ్య మంత్రులు అశోక్ గెహ్లాట్, భూపేష్ బాఘెల్ అన్నారు. 

అస‌లు దేశంలో ప్ర‌తిప‌క్షం వుండ‌రాద‌న్న ల‌క్ష్యంతో ఇలాంటి దాడుల‌కు పూనుకుని అప్ర‌తిష్ట పాలు కావ డంలో స‌ర‌దా ఏమిటో మ‌రి బిజెపీ నేత‌లు, మేధావులే స్ప‌ష్టంచేయాలి. బుధ‌వారం నాటి దాడితో  బిజెపి, మోదీ ప్ర‌భుత్వం  ప‌రిమితులు దాటి వ్య‌వ‌హ‌రించ‌డం గురించి దేశ ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల్సిన అవ‌స రం కూడా వుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...