జగన్ దీక్షకి పోలీసులు ఫుల్ స్టాప్!
Published on: Tue Oct 13, 2015 11:24AM
.jpg)
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గత ఆరు రోజులుగా చేస్తున్ననిరాహార దీక్షని ఈరోజు తెల్లవారు జామున పోలీసులు భగ్నం చేసారు. ఆయనని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తరువాత అక్కడ వైద్యులు ఆయనకి బలవనతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. తరువాత అన్ని పరీక్షలు చేసి.. ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉందని ప్రకటించారు. ఆయన భార్య భారతి, తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల, అందరూ ఆసుపత్రిలోనే జగన్ తో ఉన్నారు. జగన్ దీక్ష ముగియడంతో తరువాత కార్యాచరణ గురించి చర్చించేందుకు వైకాపా ముఖ్యనేతలు గుంటూరులో నేడు సమావేశం అవుతున్నారు.


