TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఒడిశా మావోయిస్టులకు పోవవరానికి లింకు ఏమిటి?

Published on: Sat Mar 24, 2012 11:03AM

ఒడిశాలలో ఉన్న మావోయిస్టులు ఇప్పుడు కొత్తగా పోలవరం ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడూ ఈ ప్రాంత మావోయిస్టులు పోలవరం ప్రాజెక్టు గురించి ప్రకటనలు చేయలేదు. నిజానికి ఈ ప్రాజెక్టును నిర్మించాలని రాష్ట్ర రైతాంగం ఎన్నటినుంచో ఉద్యమాలు చేస్తోంది. తమ ప్రాంతంలో సకాలంలో పంటలు పండాలన్నా, సాగునీటి, తాగునీటి కొరత తీరాలన్నా పోలవరం ప్రాజెక్టుతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర రైతాంగం అంటోంది.

 

అయితే లక్షలాది మంది రైతులు ఒక వైపు పోలవరం ప్రాజెక్టు కావాలని అడుగుతుండగా, మరోవైపు కార్మిక, కర్షక ప్రయోజనాలకోసం పోరాడుతున్నామని చెప్పే మావోయిస్టులు రైతులకు వరంలాంటి ఈ ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇటీవల మావోయిస్టులు ఇద్దరు ఇటాలియన్లను కిడ్నాప్ చేశారు. అటవీప్రాంతంలో కూంబింగ్ నిలిపివేయడంతోపాటు పోలవరం ప్రాజెక్టును కూడా రద్దు చేయాలని ఒడిశాకు చెందిన మావోయిస్టులు షరతు పెట్టారు. నిజానికి ఒడిశా ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తోంది. ఒడిశా ప్రభుత్వం, ఆ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆంధ్రాప్రాంతంలో మావోయిస్టుల వైఖరి ఎలా ఉంటుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఆంధ్రాప్రాంత మావోయిస్టులు కూడా పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్త ఏజెన్సీ ప్రాంతంలో వారికి షెల్టర్ దొరకడం కష్టమవుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.