TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మతంతో ముడిపెట్టవద్దు.. మోడీ

Published on: Mon Nov 23, 2015 9:25AM

భారత ప్రధాని నరేంద్ర మోడీ మలేషియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా మలేషియాతో మోడీ పలు కీలక ఒప్పందాలు చేసుకున్నట్టు తెలుస్తోంది. మోడీ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారని.. వారి దాడులకు అడ్డుకట్ట వేయాలని అన్నారు. కానీ ఉగ్రవాదానికి మతంతో ముడిపెట్టవద్దని సూచించారు. అంతేకాదు భద్రతా రంగంలో సహకారాన్ని మరింత పెంపొందించేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. కాగా ఈ రోజుతో మోడీ మలేషియా పర్యటన ముగియనున్న నేపథ్యంలో అనంతరం మోడీ సింగపూర్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది.