Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెనను ప్రారంభించిన ప్రధాని
posted on: Jun 6, 2025 3:20PM
.webp)
ప్రపంచంలోనే ఎత్తయిన చినాబ్ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అదేవిధంగా కట్రాలో రూ.46 వేల కోట్లతో విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో ప్రారంభోత్సవాలు చేశారు. కశ్మీర్‌ను దేశంలో ఇతర ప్రాంతాలకు కలుపుతూ రైల్వే లింక్ పూర్తిచేయడం చరిత్రాత్మకమని ప్రధాని తెలిపారు. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టు పూర్తివడం సంతోషకరమని ప్రధాని తెలిపారు. లక్షల మంది కల నెరవేరిందని ప్రధాని వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించుకున్నామని పేర్కొన్నారు. ఈరోజు చారిత్రాత్మక రోజు అని అన్నారు. ఇక కశ్మీర్ కూడా భారత్ రైల్వే నెట్‌వర్క్‌లో చేరిందని తెలిపారు. మాతా వైష్ణోదేవి ఆశీర్వాదం వల్లే ఇదంతా సాధ్యం అయిందని అన్నారు.
చీనాబ్ వంతెన అత్యద్భుతంగా నిర్మించామని తెలిపారు. రూ.46 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించామని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని.. కశ్మీర్ నుంచి కన్యాకుమారికి కనెక్టివిటీ ఎట్టకేలకు లభించిందని అన్నారు. చీనాబ్ బ్రిడ్జి పర్యటలకు ఫెవరెట్ స్పాట్ౠగా మారబోతోందని ప్రధాని పేర్కొన్నారు. ఉక్కు, కాంక్రీట్‌తో నిర్మించిన ఈ వంతెన నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున చీనాబ్ నదిపై 1,315 మీడర్ల పొడవైన వంతెనను నిర్మించారు. చైనాలోని బెయిసాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వే వంతెన పేరుపై ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. ఇక పారిస్‌లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్‌తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండటం విశేషం. 2003లో వాజ్‌పేయి ప్రభుత్వం వంతెన నిర్మాణానికి ఆమోదం తెలుపగా.. పూర్తి కావడానికి 22 ఏండ్లు పట్టింది.






