కాంగ్రెస్ కు పిజెఆర్ కొడుకు రాజీనామా  

posted on: Oct 28, 2023 11:58AM

కాంగ్రెస్ విడుదల చేసిన రెండో జాబితా తర్వాత పార్టీలో అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతోంది.  తాజాగా జూబ్లీహిల్స్ టికెట్ తనకే వస్తుందని చివరి వరకూ ఆశించి భండపడ్డ  పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. హైదరాబాద్ లో ఒక్క జూబ్లిహిల్స్ లో మాత్రమే కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ఇటీవలి సర్వేలో తేలిందన్నారు.

నియోజకవర్గంలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి ఎంతో కష్టపడ్డానని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. అలాంటిది తనకు టికెట్ ఇవ్వకుండా అజారుద్దీన్ కు కేటాయించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈవీఎంలలో తన పేరు ఉండాల్సిందేనని, ఇండిపెండెంట్ గా అయినా బరిలోకి దిగుతానని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.  కాగా, పీజేఆర్ కూతురుకు కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ నియోజకవర్గ టికెట్ ను కేటాయించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే గా,  సిఎల్పి నేతగా పి. జనార్ధన్ రెడ్డి(పిజెఆర్)  కాంగ్రెస్ పార్టీకి విశేషసేవలందించిన సంగతి తెలిసిందే. 

google-ad-img
    Related Sigment News
    • Loading...