TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పిన్నమనేని కారు బోల్తా.. భార్య డ్రైవర్ మృతి..

Published on: Tue May 17, 2016 9:57AM

 

టీడీపీ సీనియర్ నేత, ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు కారు బోల్తా కొట్టి ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి హైదరాబాద్ ఈరోజు కారులో వెళుతుండగా.. పహాడీ షరీఫ్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పిన్నమనేని సతీమణి సత్యవాణి, కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ఆయనను హుటాహుటిన జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కామినేని శ్రీనివాస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిన్నమనేని సతీమణి మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. పిన్నమనేని చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసిన ఇద్దరు మంత్రులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పిన్నమనేనికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.

 

మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిన్నమనేని ప్రమాదంపై స్పందించి.. ఆయన సతీమణి మృతి పట్ల సంతాపం తెలియజేశారు. పిన్నమనేని పరిస్థితి గురించి ఆరా తీశారు.