Latest News
ఆర్ధికసంఘం ఏర్పాటుకు పిల్
posted on: Jun 16, 2022 11:56AM
కేంద్రం నుంచి తగినంత మద్దతు వుంటేనే రాష్ట్రంలో అభివృద్ధికి వీలవుతుంది. కేంద్రం లక్షల కోట్లలో నిధులు అందిస్తున్నప్పటికీ అభివృద్ధి శూన్యమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద బిజెపి వర్గీయులు, కేంద్ర మంత్రులు ధ్వజమెత్తడం వింటూనే వున్నాం. కేంద్రం అందిస్తున్న ఆర్ధికసాయం దేనికి ఎలా ఖర్చు పెడుతున్నదీ ఎవరికీ సరయిన వివరాలు తెలియడం లేదని కేంద్రం దుమ్మెత్తిపోస్తోంది. రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో ఇరుక్కుందని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి శోభా కరంద్లాజే అన్నారు. అనంతపురం లో జరిగిన బిజెపి సమావేశం లో ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ పాలన అంతంత మాత్రంగానే వుందని, మూడేళ్ల తర్వాత కూడా అప్పులు, అవినీ తిలో కూరుకుపోయిందని ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వం అప్పుల వూబిలో పీకల్లోతు కూరుకుపోయిందని ఆమె అన్నారు.
దీనికి తోడు, రాష్ట్ర ఆర్ధిక సంఘాన్ని ఏర్పాటు చేయడంలో తాత్సారం చేయడం ఎవరూ వూహించనిది. వాస్తవానికి నాలుగవ ఆర్ధిక సంఘం కాలపరిమితి ముగిసి రెండేళ్లయినా ఐదవ ఆర్ధిక సంఘాన్ని ఏర్పాటు చేయకపోవడం దారుణం. దీన్ని సవాల్ చేస్తూ టిడిపి అధికార ప్రతినిధి, న్యాయవాది జి.వెంకట రెడ్డి పిల్ వేశారు. ఆర్ధికసంఘాన్ని ఏర్పాటు చేయకపోవడం వల్ల స్థానికి సంస్థలకు నిదుల పంపిణీ సక్ర మంగా జరగడంలేదని, ఆయా సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన పిల్‌లో పేర్కొన్నారు. చట్టనిబంధనల మేరకు ప్రతీ ఐదేళ్లకు ఒకసారి రాష్ట్ర ఆర్ధిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి. నాలుగవ ఆర్థిక సంఘం కాలపరిమితి 2020తో ముగిసింది. రెండేళ్లు గడుస్తున్నప్పటికీ ఐదవ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయలేదు. దీంతో రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు అందడం లేదు. ఈ కారణంగా స్థానిక సంస్థలు సక్రమంగా విధులు నిర్వర్తించలేకపోతున్నాయి.
స్థానిక సంస్థల ఆర్థిక పరిస్థితిని సమీక్షించి, నిధులు కేటాయించాలని గవర్నర్‌కు రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫారసు చేస్తుంది. ఆర్థిక సంఘం ఇచ్చిన నివేదికను గవర్నర్ శాసనసభ ముందు ఉంచాలి. ఆర్థిక సం ఘాన్ని ఏర్పాటు చేయ కపోవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర ఐదవ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించమని ఆ పిల్ కోరింది.



.webp)


