Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఫోన్ ట్యాపింగ్ ఇప్పటికీ జరుగుతుంది...మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
posted on: Feb 10, 2026 4:11PM

ఫోన్ ట్యాపింగ్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ ఇప్పటికీ జరుగుతూనే ఉందని, గత ప్రభుత్వానికి చెందిన బీఆర్ఎస్ పెద్దల వద్ద ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన పరికరాలు ఉన్నాయనే బలమైన అనుమానాలు ఉన్నాయని మంత్రి ఆరోపించారు. ఇటీవల కార్పొరేటర్లతో నిర్వహించిన కాన్ఫరెన్స్ కాల్‌ను కూడా ట్యాప్ చేసి విన్నారన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.
తాను కాన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడిన అంశాలు బయటికి రావడం చూసిన తర్వాతే ఈ అనుమానాలు మరింత బలపడ్డాయని తెలిపారు. “మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా అంతర్గత సమాచారం బయటికి ఎలా వెళ్తుందో అనే సందేహం ఎప్పటి నుంచో ఉందని మంత్రి తెలిపారు. ఇప్పుడు చూస్తుంటే, మేము మాట్లా డుకుంటున్న కాన్ఫరెన్స్ కాల్స్‌ను కూడా వింటున్నారు. అవి ఎలా లీక్ అవుతున్నాయి?” అంటూ మంత్రి ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
అక్రమంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో ఎవరు ఎంతటి రాజకీయ స్థాయిలో ఉన్నా వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ మామిడి తోటలో కూర్చొని ఫోన్ ట్యాపింగ్ చేస్తూ మా ఫోన్లు వింటున్నాడేమో అనే అనుమానం కూడా ఉంది. ఆయన వద్ద ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఉన్నాయని అనిపిస్తోంది”
అంటూ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతామని, కేసీఆర్ వద్ద ఉన్నట్లుగా అనుమానిస్తున్న ట్యాపింగ్ ఎక్విప్మెంట్‌ను బయటపెడతామని మంత్రి ప్రకటించారు. ఫోన్ ట్యాపింగ్ వంటి అక్రమ చర్యలు ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పుగా మారుతాయని, ప్రజల గోప్యతను భంగం చేసే ఇలాంటి చర్యలను సహించబోమని మంత్రి స్పష్టం చేశారు



.webp)


