Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జుట్టూ జుట్టూ ముడేసిన కేంద్రం
posted on: Jul 18, 2015 11:33AM
-.jpg)
* ఇరు రాష్ట్రాలకు కేంద్రం లేఖలు
* పరోక్షంగా ట్యాపింగ్ ధ్రువీకరణ
* కాల్ డేటా రికార్డులు ఇవ్వాల్సిందే
కొన్ని రోజులుగా సద్దుమణిగి ఉన్న ఓటుకు నోటు ఫోన్ ట్యాపింగ్ మళ్లీ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఒక రాష్ట్రం మా ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని అంటుంటే.. మరో రాష్ట్రం ఫోన్లు ట్యాపింగ్ చేయలేదని ఎప్పటినుండో వాదించుకుంటున్నాయి అది తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ ట్యాపింగ్ పై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై గతంలో ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లు ట్యాపింగ్ చేశారంటూ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఇదే విషయంలో ఎవరి ఆదేశాల మేరకు తమ ఫోన్లు ట్యాప్ చేశారో చెప్పాలంటూ.. కాల్ డేటా ఇవ్వాలంటూ సర్వీసు ప్రొవైడర్లకి కూడా నోటీసులు ఇచ్చారు. అయితే తెలంగాణ ప్రభుత్వం కాల్‌డేటా ఇవ్వవద్దని డేటా ఇస్తే ప్రాసిక్యూట్ చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో ఏం చేయాలో తెలినీ పరిస్థితిలో సర్వీసు ప్రొవైడర్లు కేంద్రం శరణం కోరారు.
ఇక్కడి వరకూ బానే ఉన్నా అసలు చిక్కు ఇక్కడే వచ్చింది. ఈ విషయంలో కేంద్రం రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న సమస్యను పరిష్కరించాల్సింది పోయి పరిస్థితిని ఇంకా తీవ్ర తరం చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సర్వీసు ప్రొవైడర్లు కేంద్రం సహాయం కోరగా.. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే అధికారికంగానే సర్వీస్ ప్రొవైడర్లు ‘చర్య’లు తీసుకున్నారంటూ ఏపీ సర్కారు నోటీసులు ఇవ్వడాన్ని తప్పు పడుతూ కేంద్రం లేఖ రాసింది. ట్యాపింగ్ డేటా సర్వీసు ప్రొవైడర్ల వద్ద లేదు.. నిఘా వర్గాల వద్ద మాత్రమే ఉంది అంటూ పేర్కొంది. అంటే కేంద్ర చెప్పిన దాని బట్టి చూస్తే ట్యాపింగ్ జరగడం నిజమే అని అర్ధమవుతోంది. మరోవైపు ‘ప్రభుత్వాలు సంయమనంతో చట్టాలకు లోబడి వ్యవహరించాలి’ అని సూచిస్తూ తెలంగాణకు మరో లేఖ పంపింది. ఇప్పుడు కేంద్రం ఇరు ప్రభుత్వాలకు రాసిన లేఖల వల్ల తెలుగు రాష్ర్టాల మధ్య సమస్యలను మరింత సంక్లిష్టం అవుతోంది.
అయితే ఇప్పుడు కేంద్రం పంపిన లేఖల ఆధారంగా సర్వీసు ప్రొవైడర్లు శుక్రవారం విజయవాడ కోర్టులో వాదనలు వినిపించారు. కోర్టుకు తాము కాల్ డేటా రికార్డులు ఇవ్వక్కర్లేదన్నారు. అయితే కోర్టు దీనిని పూర్తిగా వ్యతిరేకించి రికార్డులు ఇచ్చి తీరాల్సిందేనని ఆదేశించింది. పాలనా వ్యవహారాలు వేరు, కోర్టులు వేరని తెలిపింది. మొత్తానికి కేంద్ర వ్యవహారం మళ్లీ జుట్టూ, జుట్టూ ముడేసి తేల్చుకోండి అన్నట్టు ఉంది.






