Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రెండోదశ పోలింగ్.. మొరాయించిన ఈవీఎంలు
posted on: Apr 18, 2019 12:43PM

కొద్దిరోజుల క్రితం ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఈవీఎం మిషన్లపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. చాలా పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు సరిగా పనిచేయని కారణంగా ఓటర్లు వెనుతిరగాల్సిన పరిస్థితి. కొన్ని చోట్ల అయితే ఈవీఎంల కారణంగా అర్థరాత్రి వరకు పోలింగ్ జరిగింది. ఇప్పుడు ఇదే పరిస్థితి రెండోదశ పోలింగ్‌లోనూ పలు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. పలు రాష్ట్రాల్లోని చాలా పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 9 గంటల వరకు పోలింగ్ మొదలుకాలేదు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన టెక్నికల్ సిబ్బంది వాటిని సరి చేసే ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, యూపీ వంటి రాష్ట్రాల్లో ఈవీఎంలల్లో సాంకేతిక లోపాలు ఏర్పడ్డాయి. మధుర, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యంగా ఆరంభమైంది. కొన్నికేంద్రాల్లో మాక్ పోలింగ్‌లో ఈవీఎంల లోపాలు తలెత్తినట్లు తెలుస్తోంది.






