Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...లిక్కర్ స్కామ్‌లో జోగి రమేష్ బెయిల్ రద్దుకు పిటిషన్
posted on: Feb 12, 2026 8:04PM
.webp)
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎక్సైజ్ కోర్టులో అధికారులు గురువారం పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని ఎక్సైజ్ కోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను ఫిబ్రవరి 23వ తేదీకి ఎక్సైజ్ కోర్టు వాయిదా వేసింది. మరోవైపు లిక్కర్ స్కాం నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణను ఫిబ్రవరి 19వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.
ఈ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితోపాటు బాలాజీ గోవిందప్ప ఏసీబీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. గురువారం నాడు ఈ కేసును విచారించిన ఏసీబీ కోర్టు.. ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది. అలాగే వీరి బెయిల్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌ను ఏసీబీ కోర్టు ఆదేశించింది.


.webp)



